How to know the traffic fines on your vehicle in ap in telugu

మన రోజువారి పనులమీద చాలా బిజీగా తిరుగుతుంటాం .అదికూడా దూరాన్ని బట్టి కాలినడకన ద్వారా లేక ద్విచక్ర వాహనం లేక నాలుగు చక్రాల వాహనాలు వాడుతుంటాం. ప్రస్తుత కాలంలో ప్రతిఒకరి ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఉండటం సహజం .మనం మన పనులమీద అక్కడకి ఇక్కడకు తిరుగుతుంటాం. మనం తొందరపాటులో లేక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ,హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవటం మరచిపోతుంటాం.కొన్ని సమయాల్లో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించటం ఫలితంగా మనం ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని చెక్ చేసినప్పుడు వాళ్ళకి దొరికిపోయి చాలా బాధపడుతుంటాం.మనకు లోలోపల భాదవేస్తుంది అన్ని ఉన్నా మనదగ్గర సంబందించిన పేపర్స్ తేక పోవటంవల్ల పోలీసులు ఫైన్ వేస్తారు, కానీ వాటిని చెల్లించక తప్పదు.

ఇంతకు మనుపటిలాగా రసీదులు రాయటం అక్కడే చెల్లించమనటం కొన్ని జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అలాకాకుండా అక్కడికక్కడే online ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తరువాత online లేదా meeseva ద్వారా మనం మన వాహనానికి సంబందించిన జరిమాన చెల్లించవలసి ఉంటుంది. వారు గడువు ఇచ్చిన సమయంలోపల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మీ వాహనం పై ఎటువంటి జరిమానా వేశారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా . అలాకాకుండా మీ వాహనంపై జరిమానాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ చెప్పబడిన కొన్ని పద్ధతులు ద్వారా తెలుసుకోండి.

1. మీ మొబైల్ కు వచ్చిన సందేశం లోని లింక్ ను ఓపెన్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా,

2. e-చలాన app ద్వారా . లేదా,

3. https://apechallan.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Process 1 :-

పోలీసులు జరిమానా వేసినప్పుడు మీ మొబైలుకు ఒక సందేశము వస్తుంది. దానిలోని ట్రాఫిక్ e-challan 16 digit నెంబర్,మీరు కట్టవలసిన జరిమానా మొత్తము,వెహికిల్ నెంబర్ మరియు ఒక url లింక్ క్రింద ఇవ్వబడి ఉంటుంది.ఆ లింక్ పై క్లిక్ చేయగా బ్రౌజరులో ఓపెన్ అవుతుంది అందులో జరిమానాకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

 

Process 2 :-

జరిమానా లోని 16 అంకెల చలాన నెంబర్ను ఆంద్రప్రదేశ్ e-చలాన app ను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి.తర్వాత యాప్ ను ఓపెన్ చేయండి.చేయగానే యాప్ మీడియా ,ఇమేజెస్ ,వీడియో రికార్డింగ్ మరియు లొకేషన్ లాంటి కొన్ని పెర్మిషన్స్ అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.

Process 3 :-

https://apechallan.org url ను గూగుల్ క్రోమ్ లో కానీ మరి ఏ ఇతర బ్రౌసర్ ఓపెన్ చేయండి.ఓపెన్ చేయగానే ఈ క్రింద విదంగా కనిపిస్తుంది.enter the vehicle no దగ్గర మెయొక్క వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్యను ఇవ్వవలసి ఉంటుంది. తరువాత నాలుగు అంకెల క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి తరువాత సెర్చ్ పై క్లిక్ చేయండి.మీ వాహనం పై ఎటువంటి ఫైన్ ఉన్నా చూపిస్తుంది.

How to create a G-mail account in telugu

మనం ఎవరికైనా మెయిల్ పంపాలన్న లేదా మనకు ఎవరైనా మెయిల్ పంపాలన్న, చాటింగ్ చేయాలన్న మన మొబైల్ కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవాలన్న మెయిల్ ఐడీ అనేది చాల అవసరం. మీ ఒక్క జీ మెయిల్ ద్వారా గూగుల్ మ్యాప్,ప్లే స్టోర్ ,గూగుల్ న్యూస్,గూగుల్ ఫొటోస్,యూట్యూబ్ గూగుల్ డ్రైవ్ వాటిని ఆక్సిస్ చేయవచ్చు.

మనం కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ కొని,మనం దాన్ని ఆన్ చేసి ఆక్టివేట్ చేస్తున్నపుడు జీ- మెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దీనివల్ల మన మొబైల్ లోని గూగుల్ కు సంబంధించిన అన్ని యాప్స్ ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. వెబ్ ఆధారిత ఈమెయిలు అన్ని సేవలు పొందవచ్చు మొబైల్

కొత్త G-mail account ను create చేయటం ఎలానో ఒకసారి చూద్దాం.

Google.com

మీ పేరు లోని మొదట మరియు చివరి పేర్లను ఎంటర్ చేయండి.

1.Choose your username దగ్గర మీకు మీ మెయిల్ ఐడి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో ఆ యూసర్ ఐడీ ని టైప్ చేయండి.

2. ఉదాహరణకు మీ పూర్తి పేరు ram chandra అనుకుందాం, ఆ పేరును పూర్తిగా యూసర్ ఐడి ప్లేస్ లో టైప్ చేయండి మీకు ఆ మెయిల్ ఐడీ అందుబాటులో ఉంటే దానినే మీ యూసర్ ఐడి గా వాడుకోండి లేదా ఒకవేళ యూసర్ ఐడీ అందుబాటులో లేకపోతే అది మనకు వేరే ఐడి లను చూపుతుంది.

3. కొత్త పాస్వర్డ్ ఎంపిక చేసుకోండి లేదా కొత్త password ను టైప్ చేయండి.( మీ password యలా ఉండాలంటే,వేరే మీ ఫ్రెండ్స్ లేదా నీ ఇతరులు ఊహకందని విధంగా ఉండాలి.

4. మీ password లో ఇంగ్లీష్ లెటర్స్ , నంబర్స్ మరియు సింబల్ ఉండేలా చూసుకోవాలి అది కూడా ఎనిమిది లెటర్స్ తక్కువకాకుండా చూసుకోవాలి.(ఉదారణకు a-z , 0-1 మరియు . తప్ప మిగతావి వాడరాదు ),ఉదాహరణకు ram@1234567.

5.మీరు మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేసిన తరువాత మరల confirm your password దగ్గర మరల సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

6. Next పై క్లిక్ చేయండి.

7. వెరిఫికేషన్ కోసం మరియు మీ అకౌంట్ రక్షణ కోసం మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిలు ID ని ఎంటర్ చేయండి.

8.మీ పుట్టిన రోజు మరియు జెండర్ ( male or female ) ను ఎంటర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పై నొక్కండి.

మీకు వెరిఫికేషన్ కోడ్ మొబైల్ లేదా మెయిల్ ఐడి కి ఒకటి వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి ఒకే చేయగానే మీ మెయిల్ ఐడి ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.( పూర్తి ఐన వెంటనే గూగుల్ నుంచి ఒక వెల్కమ్ మెసేజ్ ఒకటి వస్తుంది.దీనితో మీ మెయిల్ క్రియేషన్ పూర్తయ్యాయి.)